క్లారియంట్‌ కెమికల్స్‌లో వాటాల విక్రయం

క్లారియంట్‌ కెమికల్స్‌లో వాటాల విక్రయం
X

క్లారియంట్‌‌ కెమికల్స్‌లో ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీ ద్వారా నందన్‌ నిలేకని కుటుంబం 2.67 శాతం వాటాను విక్రయించింది. ఇన్ఫోసిస్‌ కో-ఫౌండర్‌ నందన్‌ నిలేకని కుమారుడు నిహార్‌ ఒక్కో షేరు రూ.558.29 చొప్పున 1,92,012 షేర్లను విక్రయించాడు. అలాగే నందన్‌ నిలేకని కుమార్తె జాన్హవి కూడా ఒక్కో షేరు రూ.551.35 చొప్పున 2.26 లక్షల షేర్లను, ఆయన భార్య రోహిణి ఒక్కో షేరు రూ.546.17 చొప్పున 2 లక్షల షేర్లను విక్రయించారు. మొత్తం మీద క్లారియంట్‌ కెమికల్స్‌లో నందన్‌ నిలేకని కుటుంబం 6,18,012 షేర్ల(2.67 శాతం వాటా)ను అమ్మారు.

Tags

Next Story