ఇద్దరు బాస్కెట్ బాల్ క్రీడాకారులకు కరోనా పాజిటివ్

X
By - TV5 Telugu |14 July 2020 7:44 PM IST
ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గజగజ వణికిస్తోంది. చిన్న పెద్ద తేడాలేకుండా ఈ మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. సామన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎవరినీ వదలటం లేదు. క్రీడకారులపైన కూడా ఈ మహమ్మారి పంజా విసురుతోంది. తాజాగా బాస్కెట్‌బాల్ క్రీడాకారులకు కరోనా పాజిటివ్ సోకింది.
ఎన్‌బీఐ క్యాంపస్ లో 322 మంది క్రీడాకారులకు పరీక్షలు చేయగా వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్‌బీఐ) మంగళవారం వెల్లడించింది. ఇద్దరు క్రీడాకారులకు కరోనా సోకడంతో వారిని హోం క్వారంటైన్‌కు తరలించారు. 2019-20 సీజనులో బాస్కెట్ బాల్ పోటీలను జులై 30వ తేదీ నుంచి ప్రారంభించాలని నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రకటించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com