అంతర్జాతీయం

మ‌హిళ‌ గొంతులో ఏలిక‌పాము..

మ‌హిళ‌ గొంతులో ఏలిక‌పాము..
X

హిళకు గ‌త కొన్నిరోజులుగా గొంతు నొప్పితో బాధపడుతోంది. నొప్పి తీవ్రత ఎక్కవగా ఉండటంతో ఆమె డాక్టర్‌ని సంప్ర‌దించింది. గొంతును ప‌రిశీలించిన త‌ర్వాత డాక్టర్లు షాక్‌కు గుర‌య్యారు. గొంతులో ఉన్న ఏలిక‌పామును చూసి ఖంగుతిన్నారు. అది ఇంకా బ‌తికే ఉందని డాక్టర్లు తెలిపారు. 3.8 సెంటీ మీటర్ల పొడవున్న ఏలిక పామును ఆమె గొంతు నుంచి బయటకు తీశారు. అది అప్పటికీ బతికే ఉందని, ఆమె గొంతు కండరాల్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నందున ఆమెకు తీవ్రమైన నొప్పి కలిగిందని వైద్యులు తెలిపారు.

ఇంతకీ ఆమె గొంతులోకి ఏలికపాము ఎలా వచ్చిందో తెలిసి ఆమె షాక్ అయింది. ఆమె తిన్న చేప‌ ద్వారా ఈ ఏలిక పాము గొంతులోకి వచ్చింది. సషిమీ చేప‌లంటే ఆసియా దేశ ప్ర‌జ‌ల‌కు చాలా ఇష్టం. ఇది మంచి టేస్ట్‌తో పాటు ఆరోగ్యాన్ని కూడా ప్ర‌సాదిస్తుంది. అయితే చాలమంది ఈ చేప‌ను వండ‌కుండా ప‌చ్చిగానే తినేస్తారు. కాక‌పోతే దీనికి ఏలిక‌పాములు అల్లుకొని ఉంటాయి. చేప‌ను తినేట‌ప్పుడు ఏలిక‌పాముల‌ను తీసేసి శుభ్రం చేస్తారు. ఆ మ‌హిళ తినే చేప‌లో ఒక ఏలిక‌పామును తీసేయ‌డం మ‌ర్చిపోయిన‌ట్లు ఉంది. అది కాస్త ఆమె నోట్లోకి వెళ్లిపోయింది. ఆ చేప ముక్కను తినేప్పుడు ఏలిక పాము గొంతులోనే ఆగిపోయింది. దీంతో ఆమె నొప్పితో విలవిల్లాడింది. ఈ అరుదైన కేసును అమెరికన్ జర్నల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ అండ్ హైజీన్‌లో ప్రచురించారు.

Next Story

RELATED STORIES