మళ్లీ పెరిగిన బంగారం ధర

మళ్లీ పెరిగిన బంగారం ధర
X

బంగారం ధర మళ్లీ పెరిగింది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి మంగళవారం పెరిగింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.60 పెరిగి రూ.51,240కు చేరింది. 22 క్యారెట్ల బంగారం రూ.60 పెరిగి రూ.46,960కు చేరింది. బంగారంతో పాటు వెండి ధర కూడా రూ.210ల పెరిగి రూ.52,210గా నమోదైయ్యింది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి.

ఢిల్లీలో24 క్యారెట్ల బంగారం ధర రూ.40 పెరిగి రూ.49,050గా నమోదైయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.40 పెరిగి రూ.47,850కు చేరింది. వెండి ధర రూ.210 పెరిగి రూ. 52,210 చేరింది.

Tags

Next Story