మరోసారి లాక్‌డౌన్‌కు సిద్ధమవుతున్న బీహార్‌!

మరోసారి లాక్‌డౌన్‌కు సిద్ధమవుతున్న బీహార్‌!
X

బీహార్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కొత్త‌గా 1,116 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల‌ సంఖ్య 17,421కు పెరిగింది. కరోనా పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది.తాజాగా ఓ వైద్యుడు క‌రోనా కార‌ణంగా మృతిచెందారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించేందుకు బీహార్ సర్కార్ ఆలోచిస్తోంది. మంగళవారం బీహార్‌ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులతో సమావేశం నిర్వ‌హించ‌నుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల క‌ట్ట‌డి గురించి సమీక్షించ‌నున్నారు. ఈ విషయాన్ని బీహార్ ప్రధాన కార్యదర్శి దీపక్‌కుమార్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించే దిశ‌గా ఆలోచిస్తున్న‌ట్లు ఆయన తెలిపారు.

Tags

Next Story