లాక్ డౌన్ ఉల్లంఘన.. 18,000 మందికి పైగా జరిమానా..

లాక్ డౌన్ ఉల్లంఘన.. 18,000 మందికి పైగా జరిమానా..
X

మే 4 నుండి లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు మిజోరంలో 18,000 మందికి పైగా జరిమానా పడినట్టు పోలీసులు తెలిపారు. కోవిడ్ -19 ఆర్డినెన్స్ 2020 .. నియంత్రణ మరియు నివారణ నిబంధనలు ఉల్లంఘించినందుకు 18,247 మంది నుండి మొత్తం రూ .36,76 లక్షలు జరిమానాగా వసూలు చేశారు.. ఇది మే 4 నుండి అమల్లోకి వచ్చినట్లు పోలీసు ప్రకటన తెలిపింది. 18,247 మందిలో 8,749 మందిని ఐజాల్ జిల్లాలో, కోలాసిబ్‌లో 551, మామిట్‌లో 852, సైచువల్‌లో

435, ఛాంపైలో 842, ఖావ్‌జాల్‌లో 685, సెర్చిప్‌లో 1,495, హన్నాథియల్‌లో 537, లుంగ్లీలో 1,474, లాంగ్‌లైలో 1,460 మందిని అరెస్టు చేశారు. కాగా 11 లక్షల మంది జనాభా ఉన్న మిజోరాంలో ఇప్పటివరకూ 227 పాజిటివ్ కేసులు మాత్రమే వచ్చాయి. ఇందులో 150 మంది కోలుకున్నారు. ఇక్కడ ఒక్క మరణం కూడా నమోదు కాలేదు.

Tags

Next Story