దూబే కాల్చి చంపిన పోలీసుల పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు

గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే తన అనుచరులతో కలిసి జూలై 2 అర్థరాత్రి డీఎస్పీ దేవేంద్ర మిశ్రాతోపాటు ఎనిమిది మంది పోలీసులపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటన కాన్పూర్ దగ్గర బిక్రూ గ్రామంలో చోటు చేసుకుంది. అయితే, పోలీసుల పోస్టుమార్టం రిపోర్టుల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. దూబే గ్యాంగ్.. పోలీసులపై అత్యంత పాశవికంగా దాడి చేశారని ఈ రిపోర్టులో వెల్లడైంది. దేవేంద్రమిశ్రాపై నాలుగుసార్లు కాల్పులు జరిపారని.. అతని శరీరంలో నుంచి మూడు బుల్లెట్లు దూసుకుపోయాయి. కాల్పులు జరిపిన తరువాత డీఎస్పీ కాలునరికేశారని తేలింది. ఈ రిపోర్టులను విడుదల చేసిన డాక్టర్లు ఈ మేరకు తెలిపారు. బిక్రూ ఘటనపై దర్యాప్తు చేయడానికి యూపీ ప్రభుత్వం ఓ కమిషన్‌ను నియమించింది. ఈ పోస్టుమార్టం రిపోర్టు ఈ కమిషన్ సభ్యులకు డాక్టర్లు అందజేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

