విమానంలో వ‌ర్షం.. త‌డిసి ముద్ద అయిన ప్రయాణికులు

విమానంలో వ‌ర్షం.. త‌డిసి ముద్ద అయిన ప్రయాణికులు

బస్సులు, రైళ్లలో వర్షం లోపలికి రావటం గురించి చూసే వింటారు. మరి, ఆకాశంలో ఎగిరే విమానాల్లో వర్షం లోపలికి రావటం గురించి ఎప్పుడైనా విన్నారా..! ఏంటీ విమానంలో వర్షం ఎలా పడుతుందని అనుకుంటున్నారా! రష్యాకు చెందిన విమానంలో జరిగిన సంఘటన గురించి తెలిస్తే.. 'వార్నీ.. విమానాల్లో కూడా ఇలా జరుగుతుందా' అని ఆశ్చర్యపడిపోతారు.. ఇంతకీ ఏం జరిగిదంటే?

రోసియా ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ విమానం ఖబరోవ్స్క్ నుంచి సోచికి బయల్దేరింది. విమానం అలా గాల్లోకి ఎగిరిందో లేదో జోరుగా వాన పడింది. ఆ వ‌ర్ష‌పు నీరు కాస్త విమానం లోప‌లికి వ‌చ్చి ప్ర‌యాణికుల‌ను ఇబ్బంది పెట్టింది. దీంతో విమానంలో ఉన్నవారు తడిచి ముదయ్యారు. లక్కీగా కొందరు గొడుగును వెంట తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే.. వాళ్ల పరిస్థితి కూడా అంతే.

అయితే ఈ వ‌ర్షంలో త‌డుస్తూ కొంత‌మంది ప్ర‌యాణికులు తెగ ఎంజాయ్ చేశారు. కొంద‌రైతే వీడియోలు తీసి సోష‌ల్‌మీడియాలో పెట్టారు. ఈ వీడియోల‌కు నెటిజన్లు ఓ రేంజ్‌లో కామెంట్లు వ‌స్తున్నాయి. ఈ ఘటనపై విమాన సిబ్బంది స్పందించారు. ఏసీ లీకేజీ వ‌ల్ల ఇలా జ‌రిగిందని చెబుతున్నారు. ఏదైమైనా ఈ అద‌న‌పు సౌక‌ర్యం కోసం ఛార్జీలు అడ‌గ‌రు క‌దా అంటూ నెటిజ‌న్లు కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story