మంగళవారం కూడా తెలంగాణలో భారీ వర్షాలు!

మంగళవారం కూడా తెలంగాణలో భారీ వర్షాలు!

అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో సోమవారం పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో చాల చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. మంగళవారం కూడా తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధవారం తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.

ఒడిశా, దక్షిణ తమిళనాడు నుంచి కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కదులుతోందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ప్రభావంతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story