మరో ఎమ్మెల్యేకి క‌రోనా పాజిటివ్

మరో ఎమ్మెల్యేకి క‌రోనా పాజిటివ్
X

దేశంలో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. సామన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ మహమ్మారి ఇబ్బందులు పెడుతోంది. సినీ, రాజకీయ నాయకులపైనా కూడా కరోనా పంజా విసిరుతోంది. తాజాగా మరో ఎమ్మెల్యే కరోనా వైరస్ బారినపడ్డారు. ఒడిశాలో అధికారి బీజేడీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సుధాన్షు శేఖర్ పరిదాకి క‌రోనా సోకింది. బాలాసోర్ జిల్లా రెమూనా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే పరిదాకి క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు నిర్ధారణ అయ్యిందని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

నీలగిరి బీజేపీ ఎమ్మెల్యే సుకాంత కుమార్ నాయక్‌ను ఇటీవ‌ల‌ కలుసుకున్నారు పరిదా. అయితే సుకాంత‌కు క‌రోనా పాజిటివ్ అని తేలడంతో పరిదా హోం క్వారెంటైన్ విధించుకున్నారు.

కాగా, ఈ నెల 11న ఆయ‌న‌ శాంపిళ్లను వైద్యులు కరోనా పరీక్షలకు పంపించారు. జూలై 14న రిపోర్టులు వచ్చాయి. ఇందులో సుకాంత కుమార్‌కు కరోనా సోకినట్టు తేలింది. దీంతో బాలాసోర్ కొవిడ్ హాస్పిటల్‌లో డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

పరిదా, సుకాంత‌తోపాటు సలీపూర్ ఎమ్మెల్యే ప్రశాంత్ బెహరాకి కూడా ఇటీవల క‌రోనా సోకినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో వైరస్ సోకిన ఎమ్మెల్యేలను ఎవరెవరు కలిశారన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Tags

Next Story