పెట్రోల్ ధరల జోలికి వెళ్లకుండా డీజిల్ రేట్లను పెంచిన చమురు కంపెనీలు

పెట్రోల్ ధరల జోలికి వెళ్లకుండా డీజిల్ రేట్లను పెంచిన చమురు కంపెనీలు
X

డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వచ్చిన చమురు కంపెనీలు.. బుధవారం పెట్రోల్ ధరల జోలికి వెళ్లకుండా డీజిల్ రేట్లను పెంచాయి. గత నెల 7 నుంచి 22 రోజులపాటు పెట్రో, డీజిల్‌ ధరలు వరుసగా పెరిగాయి. దీంతో లీటర్‌ డీజిల్‌పై రూ.11.4 పైసలు పెరిగాయి. పెట్రోల్‌ ధరలు చివరిసారిగా జూన్‌ 29న పెరిగాయి. అప్పటి నుంచి దేశంలో పెట్రోల్‌ కంటే డీజిల్‌ ధరలే అధికంగా ఉంటున్నాయి. ప్రస్తుతం డీజిల్‌పై 13 పైసలు పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో లీటర్‌ డీజిల్‌ ధర రూ.81.18కి పెరిగింది. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.80.43గా ఉంది.

Tags

Next Story