మంత్రికి కరోనా పాజిటివ్

మంత్రికి కరోనా పాజిటివ్
X

దేశంలో కరోనా స్వైర విహారం చేస్తోంది. సామన్యుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల వరకు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా పంజాబ్ మంత్రికి కరోనా సోకింది. మంత్రి ట్రిప్ట్ రజిందర్ సింగ్ బాజ్వాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గ్రామీణాభివృద్ధి, పశుసంవర్ధక, పంచాయతీ, నీటి సరఫరా మరియు పారిశుద్ధ్యం శాఖలను ఆయన చూస్తున్నారు.

రజిందర్ సింగ్ బాజ్వాకు జరిపిన కరనా పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని, తిరిగి తమతో కలిసి పని చేయాలని ఆకాంక్షించారు. ఈ మేరకు సీఎం అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు.

కాగా, పంజాబ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,511 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా బారిన పడి 213 మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags

Next Story