కన్నడ హీరో ధృవ సర్జాకు కరోనా పాజిటివ్!

కన్నడ హీరో ధృవ సర్జాకు కరోనా పాజిటివ్!

ప్రముఖ కన్నడ నటుడు ధ్రువ సర్జా , ఆయన భార్య ప్రేరానా సర్జా కరోనా భారిన పడ్డారు. ఇటీవల వారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా బుధవారం పాజిటివ్ అని తేలింది. దాంతో వారు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ధ్రువ సర్జాకు కరోనా సోకిందన్న విషయం ఇండస్ట్రీలో పెద్ద షాక్ కు గురిచేసింది. కాగా ధ్రువ సర్జా.. ప్రముఖ నటుడు అర్జున్ సర్జాకు మేనల్లుడు..

అంతేకాదు నటుడు చిరంజీవి సర్జాకు సోదరుడు(తమ్ముడు). గత నెలలో గుండెపోటుతో చిరంజీవి సర్జా కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. బాలీవుడ్ అగ్ర న‌టులు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, ఆమె కుమార్తె ఆరాధ్య కరోనా సోకిన సంగతి తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story