కరోనా నుంచి కోలుకున్న ఏపీ ఎమ్మెల్యే

కరోనా నుంచి కోలుకున్న ఏపీ ఎమ్మెల్యే
X

కర్నూల్ జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాకర్‌ కు జూన్‌ 25న కరోనా నిర్ధారణ అయ్యింది. 20 రోజుల చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు. ఇటీవల జరిపిన పరీక్షలో సుధాకర్‌ కు నెగటివ్ వచ్చింది. అయితే కరోనా సోకిన మొదట్లో భయపడ్డానని.. ఆ సమయంలో కుటుంబం కళ్లముందు మెదిలారని అన్నారు. మహమ్మారిని ఆత్మస్థైర్యంతో జయించానని సుధాకర్‌ తెలిపారు. మంచి ఆహారం, యోగా, తగినంత నిద్ర, అలాగే డాక్టర్ల సూచనలు పాటించడం ద్వారా హోం క్వారంటైన్‌లోనే ఉండి వైరస్‌ను జయించానాని అన్నారు. కాగా కోడుమూరులో వైద్యుడిగా ఉన్న డాక్టర్‌ సుధాకర్ 2019 లో మొదటిసారిగా వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Tags

Next Story