సచిన్ పైలట్ కు మద్దతుగా పలువురు రాజీనామా

సచిన్ పైలట్ కు మద్దతుగా పలువురు రాజీనామా
X

రాజస్థాన్‌లో సచిన్ పైలట్‌ను ఉప ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించిన తరువాత రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఆయనకు మద్దతుగా మంగళవారం అల్వార్, టోంక్‌ ప్రాంతాలలో నిరసన ప్రదర్శనలు చేశారు. అంతేకాదు సచిన్ నియోజకవర్గమైన టోంక్ లో చాలా మంది పెద్ద కాంగ్రెస్ నాయకులు కూడా సచిన్ కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన సచిన్ వాయిస్ ను పార్టీ అణచివేసిందని విమర్శించారు. అలాగే దౌసా జిల్లాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేల్లో నలుగురు కాంగ్రెస్‌కు చెందినవారు. వీరిలో ఇద్దరు గెహ్లాట్ క్యాంప్‌గా, ఇద్దరు పైలట్ క్యాంప్‌ లో ఉన్నారు. పైలట్ క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేల నియోజవార్గాల్లో కూడా నిరసనలు హోరెత్తాయి.

Tags

Next Story