ఘోర ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. కారు డివైడర్ ను ఢీకొట్టడంతో గుంతలో పడింది. దీంతో డ్రైవర్ సహా ఒకే కుటుంబంలో ఆరుగురు మరణించారు. మరో ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన విల్లుపురం జిల్లా, టిండివనం సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగింది. మృతులను తిరునెల్వేలి జిల్లాలోని తిసయన్‌విలైకి చెందిన మురుగేష్ (40), మురుగరాజ్ (38), సోరి మురుగన్ (35), మలార్ (30), రాజి, ముత్తు మనీషాగా గుర్తించారు.
ఉదయం 6 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు కన్యాకుమారి నుంచి చెన్నైకు వెళుతున్నారు.. వారు ప్రయాణిస్తున్నకారు పదిరి హైవే వద్దకు చేరుకోగానే డ్రైవర్ స్టీరింగ్ మీద నియంత్రణ కోల్పోయాడు. దాంతో వాహనం డివైడర్ ను ఢీకొట్టి గుంతలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ముత్తు హరీష్ (6), ముత్తు మనీషా (8) ను ముండియంబక్కం లోని విల్లుపురం ప్రభుత్వ వైద్య కళాశాల కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com