సుధీర్ ని భగవంతుడు రొమాంటిక్ డ్రమ్ములో ముంచి తీశాడు: రష్మీ

బుల్లి తెర మీద ఆ జంట చేసే రొమాన్స్ ప్రేక్షకులను గిలిగింతలు పెడుతుంది. చూసిన కొద్దీ చూడాలనిపించే ముచ్చటైన జంటగా ప్రేక్షకులు కితాబిచ్చారు. లాక్ డౌన్ అనంతరం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ జంట తమ ఇష్టా ఇష్టాలను.. ఒకరిపై మరొకరికి ఉన్న అభిప్రాయలను సరదాగా పంచుకున్నారు. సుధీర్ గురించి రష్మి మాట్లాడుతూ.. సుధీర్ చాలా రొమాంటిక్.. రొమాంటిక్ అనే డ్రమ్ము ఉంటే.. అందులో సుధీర్ ను భగవంతుడు ముంచి తీశాడు. అతడిలో ఉన్న రొమాంటిక్ యాంగిల్ నాకు చాలా నచ్చుతుంది. కొంతమందిలో కోపం ఎక్కువగా ఉంటుంది. కానీ సుధీర్ సున్నితమైన మనిషి. సుధీర్ మాట్లాడుతూ నాకు రొమాంటిక్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. చెలి లోని మనోహరా.. రోజా లోని పరువం వానగా.. పాటలు చాలా ఇష్టం.
ఆ రోజుల్లో క్యాసెట్ మొత్తం అవే పాటలు రికార్డింగ్ చేయించి అదే పనిగా వినేవాణ్ణి. ఆ తర్వాత వచ్చిన సీడీల్లో కూడా అదే పాట రికార్డింగ్ చేయించుకుని వింటూ ఉండేవాణ్ణి అని చెప్పాడు. మీ ఇద్దరి మధ్య ఏదో ఉందని సోషల్ మీడియాలో కథలల్లేస్తుంటారు కదా.. మరి వాటి గురించి మీరెప్పుడూ ఫీలవరా అంటే.. సుధీర్.. మా వల్ల వాళ్లకు పని దొరుకుంది కదా. అందుకు వాళ్లకు డబ్బులు కూడా వస్తుంటాయి. ఆ వచ్చిన డబ్బుతో వాళ్ల కుటుంబం ఆనందంగా ఉంటుంది కదా అనిపిస్తుంది. నిజంగా మామధ్య ఏముందో మాకు మాత్రమే తెలుసు అని అన్నాడు. అంతలో రష్మి కల్పించుకుని చెప్పాలంటే.. మా గురించి ఇంకా మంచిగానే రాస్తున్నారనుకోవాలి.. ఎందుకంటే ఈ మధ్య కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూస్తుంటే.. ఫలానా వ్యక్తి చనిపోయారని బతికుండగానే వార్తలు వస్తుంటాయి. వాళ్లతో కంపేర్ చేసుకుంటే మేము ఇంకా బెటర్.. ఇలాంటి వార్తల్లో ఇంకా బతికే ఉన్నాం అని నవ్వుతూ చెప్పింది రష్మి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com