అంతర్జాతీయం

పెరగనున్న విమాన ఛార్జీలు

పెరగనున్న విమాన ఛార్జీలు
X

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విమానయాన న రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లింది. లాక్ డౌన్ సమయంలో ట్రావెల్‌బ్యాన్‌ విధించాక విమానయాన రంగం పరిస్థితి గాలి తీసేసిన బెలూన్‌లా తయారైంది. అయితే లాక్‌డౌన్ సడలింపులతో దేశీయ విమానాల సర్వీసులు ప్రారంభమయ్యాయి.

ఈ నేపథ్యంలో విమాన ఛార్జీలు పెరగనున్నాయి. ఆగస్టు 24 తర్వాత విమాన ఛార్జీలను పెంచనున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించారు. ప్రస్తుతం డిమాండ్ లేనందున ఆగస్టు 24 తర్వాత విమాన ఛార్జీల స్వల్పంగా పెంచే యోచనలో ఉన్నట్లు పౌర విమానయాన మంత్రి తెలిపారు. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో, విమానయాన మంత్రిత్వ శాఖ మే నెలలో దేశీయ విమాన ఛార్జీ లు పెంచాల్సి ఉన్నా తక్కువ చార్జీలనే అమలు చేసిందని, రెండు నెలల విరామం తర్వాత దేశీయ విమానాల సర్వీసులను ప్రారంభించిందని ఆయన తెలిపారు.

Next Story

RELATED STORIES