తాజా వార్తలు

ప‌రీక్ష‌ల్లో 74 శాతం ఉత్తీర్ణత సాధించిన అల్లావుద్దీన్ న‌టి

ప‌రీక్ష‌ల్లో 74 శాతం ఉత్తీర్ణత సాధించిన అల్లావుద్దీన్ న‌టి
X

బుల్లి తెర నుంచి వెండి తెరకు పరిచయమైన వారిలో అవనీత్ కౌర్ ప్రత్యేకం. డాన్స్ ఇండియా డాన్స్ ద్వారా కెరీర్ ప్రారంభించిన కౌర్.. 2014లో మర్దానీ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై అడుగుపెట్టింది. అల్లావుద్దీన్ - నామ్ తోహ్ సునా హోగా అనే ఫాంట‌సీ టీవీ షోతో సుల్తానా యాస్మిన్‌గా పాపుల‌ర్ అయింది. ప్రస్తుతం రకరకాల ప్రాజెక్టులతో బీజీగా ఉంది.

అయితే తాజాగా ప్ర‌క‌టించిన సీబీఎస్‌సీ 12వ త‌ర‌గ‌తి బోర్డ్ ప‌రీక్ష‌లో.. అవ‌నీత్ 74 శాతం ఉత్తీర‌్ణత సాధించింది. త‌న‌కి ఇంత శాతం రిజ‌ల్ట్ రావ‌డంపై అవ‌నీత్‌తో పాటు ఆమె త‌ల్లిదండ్రులు సంతోషం వ్య‌క్తం చేశారు. త‌న‌కి ఇంత పర్సంటేజ్ వ‌చ్చినందుకు ప్ర‌తి ఒక్క‌రు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

అవ‌నీత్ కౌర్ దాదాపు ద‌శాబ్దం పాటు చ‌దువుతో పాటు వృత్తిని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చింది. స్కూల్‌, కాలేజ్ యాజ‌మాన్యానికి ఈ సంద‌ర్బంగా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను అని అవ‌నీత్ పేర్కొంది. 18 ఏళ్ల ఈ బ్యూటీ ఎగ్జామ్స్ స‌మ‌యంలో అల్లావుద్దీన్ షూటింగ్‌లో కూడా పాల్గొంది.

Next Story

RELATED STORIES