తగ్గిన పసిడి ధర

తగ్గిన పసిడి ధర
X

పసిడి కోనాలనుకునే వారికి గుడ్ న్యూస్. బంగారం ధర తగ్గింది. ఇటీవల వరుసగా భారీగా పెరిగిన ధరకు అడ్డుకట్ట పడింది. దీంతో బంగారం ధర గురువారం తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లోను బంగారం ధరలు తగ్గుముఖం పట్టగా.. ఔన్స్ ధర 0.3 శాతం తగ్గి 1,805.62 డాలర్లు పలికింది. ఢిల్లీ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా తగ్గి రూ.50,000 దిగువకు వచ్చింది. 22 క్యారెట్ల బంగారం రూ.48,000 దిగువకు వచ్చింది. హైదరాబాద్‍, విశాఖ, విజయవాడల్లో 24 క్యారెట్ల బంగారం రూ.120 పెరిగి రూ.51,290కి చేరింది. 22 క్యారెట్ల బంగారం రూ.47,130 పలికింది.

Tags

Next Story