హైదరాబాద్‌ కలెక్టర్‌కు కరోనా పాజిటివ్‌..?

హైదరాబాద్‌ కలెక్టర్‌కు కరోనా పాజిటివ్‌..?

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలో పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు కూడా కరోనా బారిన పడ్డారు. తాజాగా హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతా మహంతికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఆమెకు పరీక్షలు చేయగా కోవిడ్ పాజిటివ్ అని

తేలినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయం అధికారికంగా వెల్లడికాలేదు. కరోనా అనుమానంతో ఆమె గత ఐదు రోజులుగా కార్యాలయానికి రాలేదని తెలుస్తోంది. కలెక్టర్ శ్వేతా మహంతి‌ తోపాటు.. డ్రైవర్‌కు, అలాగే కంప్యూటర్‌ ఆపరేటర్‌కు కూడా కరోనా సోకినట్టు తెలుస్తోంది. కాగా ఇప్పటికే హైదరాబాద్‌ కలెక్టరేట్‌ కార్యాలయంలో మొత్తం 15 మందికి కరోనా సోకినట్టు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story