కరోనాతో మహారాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ మృతి

కరోనాతో మహారాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ మృతి
X

మహారాష్ట్రతో కరోనా కలకలం సృష్టిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా కరోనా బారిన పడి మహారాష్ట్ర మాజీ మాజీ ఎన్నికల కమిషనర్ ప్రాణాలు కోల్పోయారు. మాజీ ఎన్నికల కమిషనర్, మరాఠీ రచయిత్రి నీల సత్యనారాయణ కొవిడ్-19 తో మృతి చెందారు.

నీల సత్యానారాయణకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలడంతో ఆమెను అంథేరి ఈస్ట్ లోని మరోల్ ప్రాంతంలోని సెవెన్ హిల్స్ హాస్పిటల్‌కి తరలించారు. చికిత్స పొందుతూ నీల సత్యనారాయణ తుదిశ్వాస విడిచారు. మహారాష్ట్ర మొట్టమొదటి మహిళా ఎన్నికల కమిషనర్ గా పనిచేసిన నీల మృతి పట్ల మహారాష్ట్ర గవర్నరు భగత్ సింగ్ కోషియారీ సంతాపం తెలిపారు.

Tags

Next Story