సెప్టెంబర్ మొదటి వారంలోగా కరోనా వైరస్..: అమెరికన్ వైద్యుడు

సెప్టెంబర్ మొదటి వారంలోగా కరోనా వైరస్..: అమెరికన్ వైద్యుడు

ఇంకో రెండు నెలలు ఓపిక పడితే యావత్ ప్రపంచం ఆశగా ఎదురుచూస్తున్న కరోనా వైరస్ కు చికిత్స దొరుకుందని అమెరికాకు చెందిన ప్రముఖ వైద్య నిపుణుడు ఆంటోనీ ఫౌచీ చెప్పారు. సెప్టెంబరు మొదటి వారంలోగా వైరస్ కి చికిత్స అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. మోనోక్లోనల్ యాంటీబాడీలతో చేస్తున్న క్లినికల్ ట్రయల్స్ ప్రయోగ ఫలితాలు సెప్టెంబరు నాటికి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ తో గురువారం జరిపిన సంభాషణలో ఈ విషయాలు వెల్లడించారు.

మోనోక్లోనల్ అనేది ప్రయోగశాలలో ఉత్పత్తి చేసే ఒక ప్రొటీన్. అనారోగ్యం బారిన పడిన వారికి చికిత్స అందజేసేందుకు, ఆరోగ్యంగా ఉన్నవారిలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు వీటిని ఉపయోగిస్తారు. లక్షణాల తీవ్రతను తగ్గించడము, ఆస్పత్రిలో చేరే అవసరాన్ని తప్పించడమో చేసే చికిత్స అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్ధిక వ్యవస్థను పునరుద్ధరించాలనే ప్రక్రియలో వైరస్ కట్టడి మార్గదర్శకాలను విస్మరించారని ఆయన అన్నారు. ముఖ్యంగా యువత కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. దీన్ని నివారించాల్సిన ఆవశ్యకత ఎందైనా ఉందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story