65 ఏళ్లు పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్ ఓటు లేదు..

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 65 ఏళ్లు పైబడిన వారిని పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి అనుమతించకూడదని ఎన్నికల సంఘం నిర్ణయించింది. లాజిస్టిక్స్, మ్యాన్ పవర్ మరియు భద్రతా ప్రోటోకాల్స్ కారణాలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజుల క్రితం, కరోనా మహమ్మారి కారణంగా ఎన్నికల కమిషన్ ఓటింగ్ నిబంధనలను మార్చింది. దీని కింద, 65 ఏళ్లు పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి అనుమతించారు. కానీ ఈ ఏడాది చివరి నాటికి బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా తాజాగా ఈ మార్పులు చేశారు.

ఈ నిర్ణయం దృష్ట్యా రాష్ట్రంలో 34 వేల అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చెయ్యాలని కమిషన్ నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రాల సంఖ్యను 1.6 లక్షలకు పెంచనున్నారు. ఇక రాష్ట్రానికి 1.8 లక్షల అదనపు ఎన్నికల సిబ్బందిని తీసుకెళ్లడం కోసం మరిన్ని రైళ్లు అవసరం.. అయితే ఈ సవాళ్లను ఎన్నికల సంఘం ఎదుర్కోవలసి ఉంటుంది.

Tags

Next Story