విశాఖ జిల్లా మామిడి పాలెం గ్రామంలో రేవ్ పార్టీ

విశాఖ జిల్లా మామిడి పాలెం గ్రామంలో రేవ్ పార్టీ
X

విశాఖ జిల్లా అనకాపల్లి మండలం మామిడిపాలెం గ్రామంలో రౌడీషీటర్ల రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. మహంకాళి సత్తిబాబు అలియాస్ పండు అనే రౌడీషీటర్ బర్త్ డే పార్టీకి మరో ఇరవై మంది రౌడీషీటర్లు హాజరయ్యారు. కోవిడ్ నిబంధనలు అతిక్రమిస్తూ పార్టీ జరుపుకున్నారు. అయితే స్థానికుల సమాచారంతో పోలీసులు దాడులు జరిపారు. కొంతమందిపై కేసు నమోదు చేశారు. గతంలో మామిడిపాలెం హత్య కేసులో ప్రధాన నిందితుడు కూడా ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇంకా ఎవరెవరు పార్టీకి హాజరయ్యారనేదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Tags

Next Story