హెచ్‌సిఎల్ చైర్‌పర్సన్‌గా రోష్ని నాడార్ మల్హోత్రా

భారత ఐటీ దిగ్గజం హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్‌పర్సన్‌గా.. సంస్థ అధినేత శివ నాడార్ కుమార్తె రోష్ని నాడార్ మల్హోత్రా నియమితులయ్యారు. ఈ మేరకు కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. 38 ఏళ్ల మల్హోత్రా.. తన తండ్రి శివ నాడార్ నుంచి పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే శివ నాడార్ మాత్రం ఇకనుంచి హెచ్‌సిఎల్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా కొనసాగుతారని కంపెనీ తెలిపింది. శివ్ నాడార్ యొక్క ఏకైక సంతానం రోష్ని నాడార్
మల్హోత్రా ఢిల్లీలో పుట్టి పెరిగారు.. అక్కడ వసంత వ్యాలీ పాఠశాలలో ప్రాధమిక విద్యను పూర్తి చేశారు. ఆమె నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయం నుండి కమ్యూనికేషన్‌లో స్పెషలైజేషన్ కోర్స్ చేశారు. ఆ తరువాత ఆమె అమెరికాలోని కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుండి మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో పట్టభద్రురాలు అయ్యారు. చదువు ముగించుకున్న అనంతరం హెచ్‌సిఎల్ కార్పొరేషన్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు సిఇఒ గా పనిచేశారు. ఇప్పుడు ఏకంగా దిగ్గజ కంపెనీకి చైర్‌పర్సన్‌గా ఎంపికయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com