శ్రీవారి దర్శనంపై టీటీడీ పునరాలోచనలో పడిందా?

శ్రీవారి దర్శనంపై టీటీడీ పునరాలోచనలో పడిందా?
X

తిరుమల కొండపై కరోనా కలకలం రేపుతోంది. శ్రీవారి పూజా కైంకర్యాలను పర్యవేక్షించే ఓ ప్రముఖ స్వామికి కరోనా పాజిటివ్ గా తేలింది. మెరుగైన చికిత్స కోసం ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఇటీవలే ముందస్తుగా అర్చకులు, జీయర్ స్వాములందరికి కరోనా టెస్టులు చేయించింది టీటీడీ.. కొండపై ఉన్న 50 మంది అర్చకుల్లో 18 మంది కరోనా భారిన పడ్డారు. రోజురోజుకు వైరస్ తీవ్రత పెరుగుతుండటంతో దర్శనాలపై టీటీడీ పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. సామీ వారికి ఏకాంతంగా పూజా కైంకర్యాలను నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Tags

Next Story