విశాఖ రైల్వేస్టేషన్ వద్ద CITU నిరసన

విశాఖ రైల్వేస్టేషన్ వద్ద CITU నిరసన
X

రైల్వేలను ప్రైవేటీకరించవద్దంటూ citu విశాఖలో నిరసన వ్యక్తం చేసింది. రైల్వ స్టేషన్ వద్ద ప్లకార్డులు పట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజల ఆస్తి అయిన రైల్వను కాపాడుకోవాలంటూ citu నేత నరసింగారావు పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థగానే రైల్వను కొనసాగించాలని citu డిమాండ్ చేసింది. 167 సంవత్సరాల చరిత్ర కలిగిన రైల్వేను వందరోజులలో ఎలా ప్రైవేటుపరం చెయ్యాలి అని మోదీ ప్రభుత్వం ప్రకటన చేసింది.. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇచ్చిందని ఇది సరైన నిర్ణయం కాదన్నారు. పేరుకు పీపీపీ పద్ధతిలో ఇస్తున్నా.. ఆస్తి మొత్తం గవర్నమెంటుదని అన్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని citu నేతలు సూచించారు.

Tags

Next Story