కరోనా సామాజిక వ్యాప్తి మొదలైంది : కేరళ సీఎం సంచలన వ్యాఖ్యలు

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కరోనా విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో కరోనా మహమ్మారి సామూహిక వ్యాప్తి ప్రారంభమైందని అన్నారు. శుక్రవారం రాజధాని నగరమైన తిరువనంతపురంలోని రెండు తీర గ్రామాలలో సమాజ వ్యాప్తి చెందుతున్నట్లు ధృవీకరించారు. గత కొన్ని రోజులుగా పుల్లువిలా, పూన్ తురా గ్రామాల్లో వైరస్ సూపర్ స్పైడర్లు తయారయ్యారని, వారి ద్వారా వైరస్ శరవేగంగా వ్యాపిస్తుందన్నారు. పుల్లువిలా ప్రాంతంలో 97
నమూనాలను పరిశీలించగా, 51 మందికి,
పూన్ తురాలో 50 శాంపిల్స్ పరీక్షించగా, 26 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయినట్టు తెలిపారు. భారత్ లో కరోనా కేసుల సంఖ్య పదిలక్షలు దాటింది, దాదాపుగా 26,000 మంది మరణించారు. అయినా కూడా భారత ప్రభుత్వం దేశంలో సామాజిక వ్యాప్తి ఇంకా ప్రారంభం కాలేదని చెప్పింది. అయితే భారత్‌లో తాజాగా కరోనా మహమ్మారి సామూహిక వ్యాప్తి ప్రారంభమైందని తొలిసారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వెల్లడించడం సంచలనగాను, ఆందోళనకరంగాను మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com