మళ్లీ పెరిగిన డీజిల్ ధరలు.. పెట్రోల్ కంటే డీజిల్‌ ధరే ఎక్కువ

మళ్లీ పెరిగిన డీజిల్ ధరలు.. పెట్రోల్ కంటే డీజిల్‌ ధరే ఎక్కువ
X

ఓ వైపు కరోనా టెన్షన్‌.. మరోవైపు డీజిల్‌ బాదుడుతో సామాన్యులు హడలిపోతున్నారు.. దేశవ్యాప్తంగా డీజిల్‌ ధరలు ప్రతి రోజూ పెరుగుతూనే ఉన్నాయి. పెట్రోల్ ధర కంటే డీజిల్‌ ధర ఎక్కువ అవుతుండటంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. జూన్‌ 7 నుంచి వరుసగా 22 రోజులపాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. అయితే జూన్‌ 29న పెట్రోల్‌ ధరను మార్చకుండా, డీజిల్‌ ధరను మాత్రమే చమురు కంపెనీలు పెంచాయి. మళ్లీ గత నాలుగు రోజుల నుంచి వరుసగా డీజిల్‌ ధరలు పెరుగుతూ వస్తున్నాయి.

రోజువారి ధరల సమీక్షలో భాగంగా లీటర్‌ డీజిల్‌పై 17 పైసలు పెంచాయి. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ డీజిల్‌ ధర రూ.81.58కు చేరింది.

అయితే పెట్రోల్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. గత నెల 29 నుంచి పెట్రోల్‌ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.80.47గా ఉంది. అంటే పెట్రోల్‌ కంటే డీజిల్‌ ధర రూ.1.11 ఎక్కువగా ఉంది.

Tags

Next Story