రాజకీయ పార్టీల నుండి సలహాలు కోరిన ఎన్నికల సంఘం

రాజకీయ పార్టీల నుండి సలహాలు కోరిన ఎన్నికల సంఘం
X

కోవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల ప్రచారాలు, బహిరంగ సభలు లేదా బహిరంగ సమావేశాలు ఎలా నిర్వహించాలనే దానిపై జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీల నుంచి సలహాలు కోరింది ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా.. అన్ని పార్టీలు నేటినుంచి జూలై 31 లోగా సూచనలు పంపవచ్చని పేర్కొంది.

కరోనా సంక్రమణను నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విపత్తు నిర్వహణ చట్టం -2005 ప్రకారం మార్గదర్శకాలను జారీ చేశాయని కమిషన్ తెలిపింది. ఈ నేపథ్యంలో బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు, వివిధ రాష్ట్రాలలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నందున.. అన్ని రాజకీయ పార్టీల నుండి సలహాలు కోరుతోంది.

మరోవైపు కరోనా సంక్రమణ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ బీహార్ లోని 9 రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికి లేఖ రాశాయి. అందులో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడి), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (సిపిఐఎం), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) (సిపిఐఎంఎల్), ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్‌సి), హిందూస్థానీ అవాం మోర్చా (హెచ్‌ఏఎం), ఎల్‌జెడి, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్‌పి), వికాషీల్ ఇన్సాన్ పార్టీ (విఐపి), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ) ఉన్నాయి.

Tags

Next Story