ఆ రాష్ట్రాల్లో వేగంగా పెరుగుతోన్న కరోనా రోగుల రికవరీ రేటు

ఆ రాష్ట్రాల్లో వేగంగా పెరుగుతోన్న కరోనా రోగుల రికవరీ రేటు
X

దేశంలో కరోనా కేసులు పది లక్షలు దాటాయి. మృతుల సంఖ్య కూడా 25 వేలు దాటింది. కరోనా కేసులు పెరుగుతున్నా.. రోగుల రికవరీ రేటు కూడా అనేక రాష్ట్రాల్లో వేగంగా పెరుగుతోంది.

కరోనాకు ఎక్కువగా ప్రభావితమైన రాష్ట్రాల్లో ఢిల్లీ కూడా ఒకటి. ఇక్కడ 82% కంటే ఎక్కువ మంది రోగులు నయమయ్యారు. అదే సమయంలో, కరోనా సోకిన కారణంగా గుజరాత్‌లో అత్యధిక మరణాలు సంభవించాయి. బుధవారం సాయంత్రం నాటికి దేశంలో కరోనా నుంచి రికవరీ రేటు 63.23% గా ఉంది.

కరోనా రోగుల రికవరీ రేటు దేశ సగటు కంటే మెరుగ్గా ఉన్న 20 రాష్ట్రాలు , యుటిలు ఉన్నాయి. నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే రికవరీ రేట్లు 75% పైన ఉన్నాయి. ఢిల్లీలో లక్షకు పైగా కేసులు వచ్చినప్పటికీ, రికవరీ రేటు 82.34% ఉంది. లఢక్ కంటే ఢిల్లీలో రేకవరేయ్ రేట్ తక్కువగా ఉంది. ఢిల్లీ మరియు హర్యానా రెండు రాష్ట్రాల్లో, నాలుగు వేలకు పైగా కేసులు నమోదవుతున్న తరువాత కూడా రికవరీ రేటు 75% కంటే ఎక్కువగా ఉంది.

దేశంలో మొదటి కరోనా కేసు జనవరి 30 న కేరళలో వెలుగులోకి వచ్చింది. ఒకానొక సమయంలో, కేరళలో కరోనా కేసులలో అగ్రస్థానంలో ఉంది. అయితే తరువాత, కేరళ కరోనా సంక్రమణను మెల్లిగా తగ్గింది. కానీ ఇప్పటికీ ఇక్కడ రికవరీ రేటు కేవలం 47.31% మాత్రమే ఉంది. కర్ణాటకలో అయితే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఇక్కడ 51 వేలకు పైగా ప్రజలు కరోనా బారిన పడ్డారు. కానీ, రికవరీ రేటు కేవలం 38.37% గానే ఉంది. మేఘాలయలో అయితే రికవరీ రేటు అతి తక్కువ ఉంది. అయితే, ఇక్కడ 377 మంది రోగులు మాత్రమే ఉండటం గమనార్హం.

గుజరాత్ మరణాల రేటు 4.59% గా ఉంది. మహారాష్ట్రలో ఎక్కువ కేసులు ఉంటే, గుజరాత్‌లో కూడా ఎక్కువగానే కేసులు వస్తున్నాయి.. కానీ మరణాల రేటు మాత్రం మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే కాస్త ఎక్కువగానే ఉంది, ఇక గుజరాత్ తరువాత మహారాష్ట్రలో అత్యధిక మరణాల రేటు ఉంది. ఇప్పటివరకు 11 వేలకు పైగా కరోనా సోకిన వారి ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్ మరణాల రేటు కూడా 3.38% ఉంది.

Tags

Next Story