నేపాల్ యువకుడికి గుండు గీయించిన వారు అరెస్ట్

యూపీలో వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. రాముడు జన్మస్థలం గురించి నేపాల్ ప్రధాని ఓలీ చేసి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. యూపీలో ఓ నేపాలీ యువకుడికి గుండుగీయించిన ఘటన చోటుచేసుకుంది. కొంత మంది ఓ నేపాలీ యువకుడికి గుండు గీసీ జైశ్రీరాం అని రాసారు. ఈ వ్యవహారం అంతా గంగా నది ఒడ్డున జరిగినట్టు తెలుస్తుంది. ఈ ఘటనలో విశ్వహిందూ సేనకు చెందిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే పోలీసులు హిందూ సేన అధ్యక్షుడు అరుణ్ పాథక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నగరంలోని పలు చోట్ల అరుణ్ పాథక్ వివాదాస్పద పోస్టర్లను అతికించారు. భారత్‌లో నివసిస్తున్న నేపాల్ ప్రజలు, ఓలీ క్షమాపణలు చెప్పాలని.. లేని యడల తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆ పోస్టర్లలో హెచ్చరించారు. కాగా.. నేపాల్ ప్రధాని ఓలీ.. రాముడు భారత్ లో పుట్టలేదని.. నేపాల్ లో పుట్టాడని చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com