జేపీ నడ్డాతో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు భేటీ!

జేపీ నడ్డాతో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు భేటీ!
X

బీజేపీ కేంద్ర కార్యాలయంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు జెపి నడ్డాతో భేటీ అయ్యారు. పార్లమెంటరీ కమిటీ చైర్మన్ హోదాలో నడ్డాను కలిసినట్టు తెలిపారు. ఈ సమావేశానికి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యం లేదని అన్నారు. కాగా రఘురామకృష్ణంరాజు కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపుతున్నారు. కీలకమైన తిరుమల శ్రీవారి భూములు, ఇసుక కొరత ,

అలాగే ఇళ్ల పట్టాల పంపిణీలో అవినీతి వంటి అంశాల్లో ప్రభుత్వ తీరును ఎండగట్టారు. దీనిని జీర్ణించుకోలేని వైసీపీ.. ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్టీ లైన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. అందులో పార్టీ పేరు అస్పష్టంగా ఉండటంతో దీనిని కూడా రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. దాంతో ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ లోక్ సభ స్పీకర్ కు వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు.

Tags

Next Story