చర్చలతో ఎంత వరకు సమస్య పరిష్కారమవుతుందో చెప్పలేను: రాజ్‌నాథ్ సింగ్

భారత్‌కు చెందిన ఒక్క ఇంచు భూభాగాన్ని కూడా ఆక్రమించే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భారత్, చైనా సరిహద్దుల విషయంలో తలెత్తిన వివాదంపై చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. అయితే, చర్చల ద్వార సమస్య ఎంత వరకు పరిస్కారం అవుతుందో చెప్పలనని అన్నారు. చర్చల ద్వారా సమస్య పరిస్కారం అయితే.. అంతకన్నా కావల్సింది ఏముందని అన్నారు. లడ్డఖ్ పర్యటనలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులపై సీడీఐ బిపిన్ రావత్, ఆర్మీచీఫ్ నరవాణేతో భేటీ అయ్యారు. అటు ఐటీబీటీ, వాయుసేన, ఆర్మీకి చెందిన సీనియర్ కమాండర్లతో కూడా కలిసి మాట్లాడారు. దేశ సరిహద్దును కాపాడడానికి సైనికులు వీరమరణం పొందారని అన్నారు. భరత మాత ముద్దు బిడ్డలైన సైనికుల త్యాగాలను దేశం మర్చిపోదని అన్నారు. వీరసైనికులు నివాళి అర్పించారు. భారత జవాన్ల తల్లిదండ్రులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ఆయన అన్నారు. భారత్ వేరే దేశపు భూభాగంపై ఎప్పుడూ కన్నేయలేదని.. ఒక్క ఇంచు భూమిని కూడా ఆక్రమించాలన్న ఆలోచన కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. భారతీయులనే కాకుండా.. ప్రపంచ దేశాలను కూడా తమ కుటుంబంలోని భాగంగానే చూసే గొప్ప మనసు భారతీయులదని.. తమతో పాటు అందరూ బాగుండాలని ఆలోచిస్తామని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com