అమర్‌నాథ్‌ ఆలయంలో కేంద్ర రక్షణ మంత్రి పూజలు

అమర్‌నాథ్‌ ఆలయంలో కేంద్ర రక్షణ మంత్రి పూజలు
X

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రెండు రోజుల లడఖ్, జమ్ముకశ్మీర్ పర్యటనలో ఉన్నారు. పర్యటనలో రెండో రోజు అమర్‌నాథ్‌ గుహను సందర్శించారు. ఆలయంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవానే, ఇతర ఉన్నతాధికారులు పూజలు చేశారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ సుమారు గంట పాటు ఆలయ ప్రాంగణంలోనే గడిపారు.

కాగా, శుక్రవారం జమ్మూ కశ్మీర్‌లో మొత్తం భద్రత పరిస్థితిని ఉన్నత స్థాయి సైనిక అధికారులతో సమీక్షించారని అధికారులు తెలిపారు. పాకిస్థాన్‌తో నియంత్రణ రేఖ వెంట కట్టుదిట్టమైన నిఘాను కొనసాగించాలని కూడా రక్షణ మంత్రి చెప్పారు.

Tags

Next Story