దారుణం: నోటిలో గుడ్డ కుక్కి అప్పుడే పుట్టిన శిశువు హత్య

దారుణం: నోటిలో గుడ్డ కుక్కి అప్పుడే పుట్టిన శిశువు హత్య
X

హర్యానాలో దారుణం వెలుగులోకి వచ్చింది. అప్పుడెపుట్టిన శిశువును క్రూరంగా హతమార్చారు. ఈ ఘటన పానిపట్ జిల్లాలోని సమల్ఖా మండలం బుద్షామ్ గ్రామంలో జరిగింది. ఆ గ్రామ సర్పంచ్ ఇంటి వెలుపల ఉన్న కాలువలో అప్పుడే పుట్టిన ఆడ శిశువు చనిపోయి ఉంది. దాంతో పోలీసులకు సమాచారం అందింది. అయితే ఈ కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. శిశువు నోటిలో గుడ్డ కుక్కి.. అనంతరం శిశువును కాలువలోకి విసిరారని.. సివిల్ ఆసుపత్రిలో శిశువు మృతదేహనికి నిర్వహించిన పోస్టుమార్టంలో నిర్ధారణ అయింది.

శిశువు బుధవారం రాత్రి పుట్టిందని పోస్టుమార్టం లో వెల్లడైంది. ఆ తరువాత బాలికను చంపడానికి నోటిలో ఒక గుడ్డ ఉంచి హత్య చేశారని. అనంతరం హంతకులు శవాన్ని కాలువలో విసిరి పారిపోయారని పోలీసులకు తెలిసింది. ఈ కేసులో సెక్షన్ 302 ను చేర్చినట్లు సమల్కా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ హర్విందర్ సింగ్ తెలిపారు.

Tags

Next Story