ప్యాకేజీ పద్దతిలో అప్పు తీరుస్తా.. కేసులు మాఫీ చేయరా ప్లీజ్..: మాల్యా

బ్యాంకులకు వేల కోట్ల రూపాయల అప్పులను ఎగ్గొట్టి భారత్ నుంచి పరారై బ్రిటన్ లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా.. తనపై ఉన్న కేసులను, ఎదుర్కోవాల్సిన శిక్షల నుంచి తప్పించుకునేందుకు భారత్ కు భారీ ఆఫర్ ను ప్రకటించాడు. మాల్యా తరపున భారత్ లో సుప్రీంకోర్టులు వాదిస్తున్న న్యాయవాదికి మాల్యా తన ప్రతిపాదనను తెలియజేశారు. బ్యాంకుల వద్ద పొందిన రుణాల మొత్తాన్ని ఒక ప్యాకేజీ పద్దతిలో చెల్లిస్తానని తెలిపారు. ఈ ప్రతిపాదనను అంగీకరించిన పక్షంలో తనపై ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసులు ఓ కొలిక్కి వస్తాయని మాల్యా భావిస్తున్నట్లు తెలుస్తోంది. మాల్యా కేసును చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. అయితే ప్యాకేజీ కింద మాల్యా ఎంత మొత్తం చెల్లిస్తారనేది మాత్రం వెల్లడించలేదు. అయితే, ఎప్పటికప్పుడు ఇలాంటి ఆఫర్లు ఇచ్చే అలవాటు మాల్యాకు ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. భారతదేశానికి రాకముందే అతడిని డబ్బు జమ చేయనివ్వండి. ఆ తరువాతే మాల్యాను భారతదేశానికి రప్పించవచ్చని సూచన చేశారు. రుణాల ఎగవేత కేసులో ఢిల్లీ కోర్టు మాల్యాకు 2016లో నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కోర్టుకు హాజరు కాకపోవడంతో ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com