కడుపులో పెరుగుతున్న బిడ్డ.. భర్త, అత్తమామలు వారం రోజుల వ్యవధిలో..

కడుపులో పెరుగుతున్న బిడ్డ.. భర్త, అత్తమామలు వారం రోజుల వ్యవధిలో..

ఒకే ఆఫీస్ లో పనిచేసే వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా కడుపులో బిడ్డ ప్రాణం పోసుకుంటోంది. ఇంతలోనే మహమ్మారి కరోనా ఆ పచ్చని కాపురంలో నిప్పులు పోసింది. వారం రోజుల వ్యవధిలో భర్త, అత్తమామలను పొగొట్టుకుని ఒంటరిగా విలపిస్తోంది నిండు గర్భిణీ. వరంగల్ నగరంలోని ఓ కార్యాలయంలో పనిచేసే యువతి తన సహోద్యోగిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఓ రోజు భర్తకు తీవ్ర జ్వరం, కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరి టెస్ట్

చేయించుకుంటే పాజిటివ్ అని ఈనెల 2న రిపోర్ట్ వచ్చింది.

అతడు మొదట వరంగల్ ఎంజీఎంలో ఆస్పత్రిలో చికిత్స పొంది తరువాత హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. అంతలోనే మామకి కరోనా సోకడంతో ఎంజీఎంలో చికిత్స పొందుతూ మరణించారు. మామ మృతిని తట్టుకోలేక అత్తమ్మ కూడా ఆ మరుసటి రోజే కన్నుమూసింది. ఈలోగా హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్త పరిస్థితి విషమించడంతో గురువారం మరణించాడు. వారం రోజుల వ్యవధిలో వరుస మరణ వార్తలు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కూడా ప్రాణాలు కోల్పోవడంతో ఆమె గుండెలవిసేలా రోదిస్తోంది. కనికరం లేని కరోనా ఇంకా ఎంత మంది జీవితాలను చీకటి చేస్తుందో.

Tags

Read MoreRead Less
Next Story