తెలంగాణలో లాల్‌ దర్వాజ బోనాలు

తెలంగాణలో లాల్‌ దర్వాజ బోనాలు
X

హైదరాబాద్ పాతబస్తీ లాల్‌ దర్వాజ బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం అర్చకులు అమ్మవారికి జల కడవ సమర్పించారు. ఆదివారం సాయంత్రం అమ్మవారి శాంతి కళ్యాణం జరగనుంది. అక్కన్న మాదన్న ఆలయంతో పాటు అన్ని పురాతన అమ్మవారి ఆలయాల్లో పూజలు నిర్వహించనున్నారు.

ఇక సోమవారం రంగం, బలిగంప, పోతురాజుల గావు కార్యక్రమాలు జరగనున్నాయి. కరోనా వ్యాప్తి దృష్ట్యా భక్తులు లేకుండా, కేవలం ఆలయ కమిటీ సభ్యులతోనే బోనాల వేడుకలను అధికారులు నిర్వహిస్తున్నారు.

Tags

Next Story