తమిళనాడులో కరోనాతో ఒక్కరోజే 88 మంది మృతి

తమిళనాడులో కరోనాతో ఒక్కరోజే 88 మంది మృతి
X

దేశంలో కరోనా స్వైర విహారం చేస్తోంది. ఇక తమిళనాడులో కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజురోజుకూ భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటంతో.. రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో అక్కడ 4,807 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి ఒక్కరోజే 88 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య 1,65,714కు పెరిగింది. కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 2,403 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారి నుండి కోలుకుని 1,13,856 మంది డిశ్చార్జ్ అయ్యారు.

Tags

Next Story