తిరుమలలో కరోనా పంజా!

తిరుమలలో కరోనా పంజా!
X

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ఇక తిరుమలలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పటికే 160 మంది టీటీడీ సిబ్బంది, 16 మంది అర్చకులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. శనివారం శ్రీవారి నిత్య కైంకర్యాలు నిర్వహించే పెద్దజీయర్‌స్వామికి కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తిరుమలలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంలో టీటీడీ సిబ్బందిలో భయాందోళన మొదలైంది.

స్వామివారికి నిత్యసేవలుచేసే 50 మంది వంశపారంపర్య అర్చకుల్లో 16 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం టీటీడీ అధికారులతో బోర్డు చైర్మన్‌ సుబ్బారెడ్డి టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పెద్దజీయర్‌స్వామిని మెరుగైన వైద్యం కోసం చెన్నై అపోలో హాస్పిటల్‌కి తరలించాలని ఆదేశించారు.

పెద్దజీయర్‌స్వామికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన నేపథ్యంలో ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. శ్రీవారి ఆలయంలో పనిచేసే అర్చకులస్థానంలో వేరొకరిని తీసుకురాలేమని, శ్రీవేంకటేశ్వరస్వామికి నిత్య ఆరాధనలు ఆపితే మానవజాతికి మంచిది కాదని పేర్కొన్నారు.

Tags

Next Story