మాస్కు‌ లేకుంటే రూ.1000 జరిమానా : రాచకొండ సీపీ

మాస్కు‌ లేకుంటే రూ.1000 జరిమానా : రాచకొండ సీపీ

తెలంగాణలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఇక హైదరాబాద్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ghmc పరిధిలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రతిఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాలని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ సూచించారు. మాస్కు ధరించకపోతే రూ.1000 జరిమానా విధిస్తామని ప్రకటించారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని వివిధ పోలీసు స్టేషన్లకు చెందిన 31 మంది సిబ్బంది కరోనాను జయించి ఈ రోజు విధుల్లో చేరారు. విధుల్లో ఉన్న సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story