ట్విట్టర్‌కు నోటీసులు పంపిన భారత సర్కార్

ట్విట్టర్‌కు నోటీసులు పంపిన భారత సర్కార్
X

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌పై సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌కు భారత సర్కార్ నోటీసులు జారీ చేసింది. హ్యాక్‌కు గురైన ఖాతాలో భారతీయులు ఎవరెవరు ఉన్నారో తెలపాలని భారత సైబర్‌ సెక్యూరిటీ నోడల్ ఏజెన్సీ సీఈఆర్టీ-ఇన్ ట్విట్టర్‌కు నోటీసు జారీ చేసింది. హ్యాక్‌ గురించి,వారికి కలిగిన నష్టం, ఆ అకౌంట్ల గురించి భారతీయ వినియోగదారులకు సమాచారం ఇచ్చారా లేదా అనేది కూడా తెలియజేయాలని ట్విట్టర్‌‌ను కోరింది. హ్యాకింగ్‌ తగ్గించేందుకు ట్విట్టర్‌‌ తీసుకున్న చర్యల గురించి కూడా చెప్పాలని కోరింది.

Tags

Next Story