అండమాన్‌లో ఇండియన్ నేవీ భారీ యుద్ధ విన్యాసాలు

X
By - TV5 Telugu |19 July 2020 3:23 PM IST
అండమాన్ నికోబార్ దీవుల్లో ఇండియన్ నేవీ భారీ యుద్ధ విన్యాసాలను నిర్వహిస్తున్నది. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియన్ నేవీ ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నది. మరో వైపు దక్షిణ చైనా సముద్రంలో అమెరికాకు చెందిన సూపర్ ఎయిర్‌క్రాప్ట్ క్యారియర్స్ డ్రిల్స్ నిర్వహిస్తున్నది. ఈ సమయంలోనే భారత్ కూడా యుద్ధ విన్యాసాలు చేపడుతుండడం గమనార్హం. యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, సముద్ర గస్తీ యుద్ధ విమానాలు ఈ ఎక్సర్‌సైజ్‌లో పాల్గొన్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. మలక్కా జలసంధి సమీపంలో మోహరించిన పలు యుద్ధనౌకలు కూడా ఈ విన్యాసాల్లో భాగమైనట్లు సమాచారం.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com