గవర్నర్‌కు కన్నా లక్ష్మీ నారాయణ లేఖ

గవర్నర్‌కు కన్నా లక్ష్మీ నారాయణ లేఖ
X

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు లేఖ రాశారు. ప్రభుత్వం పంపించిన క్యాపిటల్ బిల్లులకు ఆమోదం తెలపొద్దని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. రాజధాని ప్రాంత అభివృద్ధి చట్టం, 2014ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తూ.. మీ ముందుకు బిల్లును పంపించిందని... అయితే.. అది రాజ్యాంగ విరుద్ధమని లేఖలో వివరించారు. నిజానిజాలను మీ ముందుకు తీసుకొచ్చేందుకు ఈ లేకను రాసానని గవర్నన్ ను ఉద్దేశించి అన్నారు. రెండు బిల్లులను శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపించిందని.. అవి పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. వికేంద్రీకరణపై బిల్లు, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014కు వ్యతిరేకంగా తెలిపారు. అమరావతి బాండ్లను అమ్మి గత ప్రభుత్వం 2000 కోట్లు సేకరించిందని అమరావతి రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అమరావతి బాండ్ల అమ్మకం ద్వారా గత 2000 కోట్లు సమీకరించిందని.. కేంద్రం కూడా అమరావతి అభివృద్దికి నిధులు కేటాయించిందని లేఖలో వివరించారు. అమరావతిని రాజధానిగా ఉంటుందనే ఒప్పందంతో రైతులు 32,000 ఎకరాల సాగు భూమిని ఇచ్చారని లేఖలో తెలిపారు. ప్రజలు, రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని బీజేపీ తరపున విజ్ఞప్తి చేస్తున్నా.. ఆ బిల్లులు ఆమోదించవద్దు అంటూ గవర్నర్‌కు పంపిన లేఖలో కన్నా కోరారు.

Tags

Next Story