భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య

భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య

భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. షామ్లీ జిల్లాలోని సోంటా గ్రామానికి చెందిన 40 ఏళ్ల బాలేందర్‌సింగ్‌ భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్నాడు. భార్యభర్తల మద్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో ఇటీవల భార్య ఇద్దరు పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తరువాత భర్త ఎంత బతిలాడినా ఆమె ఇంటికి రానని తెగేసి చెప్పింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాలేందర్‌ సింగ్‌ శనివారం రాత్రి పిస్టోల్‌తో తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడికి పిస్టోల్‌ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story