ప్ర‌భాస్‌కి జోడిగా దీపిక పదుకొణే!

ప్ర‌భాస్‌కి జోడిగా దీపిక పదుకొణే!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ 21వ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ నటించనుంది. ప్రస్తుతం ప్రభాస్ 'రాధేశ్యామ్' మూవీలో నటిస్తున్నాడు. ప్రభాస్ 21వ మూవీ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. 'మ‌హాన‌టి' మూవీతో ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న‌ాడు నాగ్ అశ్విన్. ప్ర‌భాస్‌తో నాగ్ అశ్విన్ సినిమా తెరకెక్కిస్తుండటంతో.. ఈ మూవీ ఆప్‌డేట్ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్‌ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చింది మూవీ యూనిట్.

వైజ‌యంతీ బ్యాన‌ర్‌లో భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌ిస్తున్న ఈ మూవీ సంబంధించి ఓ విషయాన్ని మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ మూవీలో ప్ర‌భాస్‌కు జోడిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ దీపిక పదుకొణే న‌టించ‌నున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది. దీపిక‌కు తెలుగులో ఇదే తొలి సినిమా కావ‌డం విశేషం. దీంతో ఈ మూవీపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story