రాజస్థాన్ లో కాంగ్రెస్ సర్కారుకు ఊరట.. ఆ ఎమ్మెల్యేల మద్దతు

రాజస్థాన్ లో కాంగ్రెస్ సర్కారుకు ఊరట.. ఆ ఎమ్మెల్యేల మద్దతు
X

రాజస్థాన్ లో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. తిరుగుబాటు ఎమ్మెల్యేల వ్యవహారం హైకోర్టులో ఉండగా.. బహుజన ట్రైబల్ పార్టీ (బిటిపి) తమ మద్దతు ప్రకటించడంతో కాంగ్రెస్ సర్కార్ అవిశ్వాస సంక్షోభం నుంచి గట్టెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిటిపి మద్దతు ఇస్తుండడంతో అశోక్ గెహ్లాట్ గవర్నర్ ను కలిసి ప్రభుత్వానికి సరిపడా బలం ఉంది అంటూ లేఖ అందించారు. ఇప్పటిదాకా వందమంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది అంటూ చెబుతోన్న గెహ్లాట్ బీటిపికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతుతో మాజిక్ ఫిగర్ 101 ని దాటామని అంటున్నారు.

ఇదే విషయాన్నీ గవర్నర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ యువనేత సచిన్ పైలట్ కొంతమంది ఎమ్మెల్యేలతో ఢిల్లీలో శిభిరాన్ని ఏర్పాటు చేయగానే అప్పటివరకు గెహ్లాట్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన బిటిపి తమ ఇద్దరు ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై జరిగే ఓటింగ్ లో పాల్గొనకూడదని ఆదేశించింది. దీంతో గెహ్లాట్ ప్రభుత్వం మైనారిటీ లో పడింది. ఇప్పుడు బిటిపి పార్టీ అనూహ్యంగా మనసు మార్చుకొని తమ మద్దతు గెహ్లాట్ కె ఉంటుందని ప్రకటించడంతో ముఖ్యమంత్రి గవర్నర్ ను కలిసి మద్దతు లేఖ అందించారు.

Tags

Next Story