దర్శకులు పిలిచినప్పుడు వాళ్ల గదికి వెళ్లకపోతే.. : రిచా చద్దా

దర్శకులు పిలిచినప్పుడు వాళ్ల గదికి వెళ్లకపోతే.. : రిచా చద్దా
X

బాలీవుడ్ లో బంధుప్రీతి కారణంగానే యువ నటుడు సుశాంత్ రాజ్ పుత్ సింగ్ మరణించాడని ఇండస్ట్రీలోని చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే నటి రిచా చద్దా సోషల్ మీడియాలో దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండస్ట్రీలో రెండే వర్గాలు ఉన్నాయి. ఒకటి జాలి ఉన్నవాళ్లు.. రెండు జాలి లేని వాళ్లు. సుశాంత్ మరణించిన నెల రోజుల తర్వాత సంతాపం ప్రకటించిన సదరు దర్శకులు.. హీరోయిన్లు తమ గదికి రాకపోతే వాళ్లని తమ సినిమాల నుంచి తీసేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కొందరు దర్శకులు హీరోయిన్లను చాలా చులకనగా చూస్తారు అని ఆవేదన వ్యక్తం చేసింది. సుశాంత్ తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఇద్దరం థియేటర్ గ్రూప్ వర్క్ షాపుకు పనిచేసేవాళ్లం. రిహార్సల్స్ చేయడానికి సుశాంత్ నన్ను బండిమీద తీసుకెళ్లేవాడు అని చెప్పుకొచ్చింది రిచా.

Tags

Next Story